Tuesday, 15 September 2020

'మీకో గుడ్ న్యూస్.. వేల సంవత్సరాల క్రితంనాటి మీ పూర్వీకులెవరో తెలుసుకోండిలా.. సో ఈజీ'

మీకో గుడ్ న్యూస్.. అంటూ మొత్తానికి భలే విషయం చెప్పాడు డైరెక్టర్ . వేల సంవత్సరాల క్రితంనాటి మీ పూర్వీకులెవరో తెలుసుకోండిలా అంటూ అదెలాగ, ఏం చేస్తే తెలుస్తుందనే విషయం చెప్పేశాడు. ఈ లాక్‌డౌన్ వేళ '' అంటూ జనానికి తెలియని రకరకాల మ్యాటర్స్ అందరి ముందుకు తెస్తున్న పూరి జగన్నాథ్.. తాజాగా ఈ ఆసక్తికర విషయం పంచుకున్నారు. మరి ఆయన చెప్పిన ఆ వివరాలేంటో చూద్దామా.. ''నేను ఎవరిని? ఎక్కడ్నుంచి వచ్చానని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీలో ఉంటే.. మీకో గుడ్ న్యూస్ చెప్తా. నేషనల్‌ జాగ్రఫీ ఛానెల్‌ వారు జీ నాన్సి అనే ఓ టెస్ట్‌ చేస్తున్నారు. మనం డబ్బులు కడితే వాళ్ళు ఓ కిట్ పంపిస్తారు. అందులో ఓ ఇయర్ బడ్ లాంటిది ఉంటుంది. దాంట్లో మీ సలైవా నింపి వాళ్లకు పంపిస్తే వాళ్లు డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. దీని ద్వారా మీ పూర్వీకులెవరో తెలుసుకోవచ్చు. అలాగే మీ లోని డిసీజ్‌లు అల్జీమర్స్, పార్కిన్‌సెస్‌ లాంటి వాటికి కారణాలు కూడా తెలుసుకోవచ్చు. Also Read: వాళ్ల దగ్గర డీఎన్‌ఏ రిలేటివ్స్‌ టూల్‌ అని ఒకటుంటుంది. దాన్నిబట్టి మీ పూర్వీకులు ఎవరు? అని తెలుసుకోవచ్చు. అబ్రహం లింకన్ మీకు చుట్టం కావచ్చు. క్లియోపాత్ర మీ అక్క కావచ్చు. చెంగిజ్‌ఖాన్‌ రక్తం మీలో ఇంకా ఉండొచ్చు. అందులో రీజనల్ అంటే లాస్ట్ 500 ఇయర్స్‌లో మీ రెలేటివ్స్ ఎవరు? ఇంకా లోతుగా వెళ్తే వలసవాదులుగా మన పూర్వీకులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు. ఇలా వాళ్లు మనకు సంబంధించి 74 రిపోర్ట్స్‌ ఇస్తారు. ఈ టెస్ట్ పేరు జీన్ 2.0. ఈ టెస్ట్‌ ఖరీదు 150 డాలర్లుంటుంది. నేను నా టెస్ట్‌ చేయించుకున్నా. నాకు చాలా విషయాలు తెలిశాయి. మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ చేయించుకోండి. గూగుల్ చేయండి సమాచారం దొరుకుతుంది'' అని చెప్పారు పూరి జగన్నాథ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35PXENZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...