Saturday, 26 September 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా పదుకొనే

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా స్టార్ హీరోయిన్‌ శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం రకుల్‌ప్రీత్ సింగ్ విచారణకు హాజరు కాగా.. శనివారం దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌ను విచారిస్తున్నారు. ముంబైలోని కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌‌లో ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట దీపిక హాజరైంది. మరోవైపు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారించనున్నారు.శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ను శనివారం మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం కరిష్మాను నాలుగు గంటల పాటు విచారించిన ఎన్సీబీ అనేక కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఈరోజు దీపిక, కరిష్మాను ఒకేసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331L2Bs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...