తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల తన 35వ బర్త్‌డే వేడుకలను ప్రియురాలు నయనతారతో కలిసి గోవాలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తన ప్రియుడు పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి జరిపించడమే కాకుండా ఖర్చంతా తానే భరించినట్లు తెలుస్తోంది. Also Read: గోవాలో వీరిద్దరు మూడు రోజులు ఎంజాయ్ చేయగా.. అందుకోసం నయన్ ఏకంగా రూ.25లక్షలు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విఘ్నష్ శివన్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీదాన్( తెలుగులో నేను రౌడీ నే) సినిమాలో నయనతార నటించారు. ఆ చిత్ర షూటింగ్‌లో ఇద్దరి పరిచయం ముదిరి ప్రేమగా మారింది. Also Read: ఇప్పటి నుంచీ వీరిద్దరు రిలేషన్ కొనసాగిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తమకు కొన్ని కలలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకునే వరకు పెళ్లి చేసుకోమని విఘ్నేష్ ఇటీవల ఓ ఇంట్వర్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో కాదువాకుల రెండు కాదల్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mSmcMf
v
No comments:
Post a Comment