Thursday, 17 September 2020

షాకింగ్.. డ్రగ్స్ కేసులో తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు.. డ్రగ్ పార్టీల్లో రెగ్యులర్‌గా 'సాహో' బ్యూటీ!

బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరితమైన పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తుండటం సంచలనంగా మారింది. డ్రగ్స్ రాకెట్‌లో శ్రద్దా కపూర్ పేరు కూడా బయటకొచ్చిందని, ఆమె గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీక్రెట్‌గా అన్వేషణ మొదలుపెట్టారని ప్రస్తుతం పలు మీడియా సంస్థల వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో సాహో బ్యూటీ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ ఫామ్ హౌస్‌లో జరిగే డ్రగ్ పార్టీలకు రియా చక్రవర్తి, సారాలతో పాటు శ్రద్దాకపూర్ కూడా హాజరయ్యేదని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ ఇష్యూలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఇష్యూ సీరియస్‌గా తీసుకోవడంతో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న సెలబ్రిటీల పేర్లు విని షాకవుతున్నారు పేక్షకులు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు ఒప్పుకున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటపెట్టడం సెన్సేషన్ అయింది. ఇప్పుడు మరో హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరు కూడా బయటకు రావడం మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. Also Read: సుశాంత్ ఫామ్ హౌస్‌లో జరిగే డ్రగ్ పార్టీల్లో రెగ్యులర్‌గా శ్రద్దాకపూర్ కూడా హాజరయ్యేదని, నిత్యం వారు పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తేలినట్టు సమాచారం. మరోవైపు డ్రగ్స్ మాఫియా విషయమై మీడియాలో వస్తున్న కథనాలపై రకుల్ ప్రీత్ ఫైర్ అయింది. తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని రకుల్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలతో డ్రగ్స్ ఇష్యూపై భిన్న కోణాల్లో చర్చలు మొదలయ్యాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kjLXmq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...