Monday, 7 September 2020

‘మహాప్రస్థానం’ టీజర్: ఫస్ట్ సింగిల్ షాట్ మూవీ.. రియల్ టైమ్‌తో వెళ్లే రీల్ స్టోరీ

తనీష్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘మహాప్రస్థానం’. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ నాయికగా నటించింది. మరో కీలక పాత్రలో ‘వరుడు’ ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు సందర్భంగా సుప్రీమ్ హీరో మహాప్రస్థానం సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘మహాప్రస్థానం సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా సింగిల్ షాట్ ప్యాట్రన్‌లో రూపొందించారు. ఈ సినిమాలో రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటేలా ఉంటాయి. ఇది తెలుగులో కొత్త ప్యాట్రన్. ఇలా కొత్త రకం సినిమా చేసిన ‘మహాప్రస్థానం’ టీమ్ సభ్యులకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. ఇది మన తెలుగు సినిమా, మనం ప్రోత్సహించాలి’’ అని అన్నారు. Also Read: దర్శకుడు జాని మాట్లాడుతూ.. ‘‘మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్ గారికి థాంక్స్. ‘మహాప్రస్థానం’ కొత్త స్టైల్‌లో చేసిన సినిమా. ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఈ ప్యాట్రన్‌లో ఇదే తొలి సినిమా. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం మా సినిమా ప్రత్యేకత. రెండు గంటల్లో జరిగే కథ ఇది. కథ పరంగా నిడివి ఎంతో మనం చూసే సినిమా నిడివి కూడా అంతే ఉంటుంది. సింగిల్ షాట్ ప్యాట్రన్‌లో సినిమా తీశాం. దర్శకుడు, క్యారెక్టర్లు, హీరో ఇలా ఎవరి కోణంలో సినిమా సాగదు, కేవలం కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా జరుగుతుంటుంది. కొన్ని సంఘటనల సమాహారాన్ని ఎలాంటి బ్రేకులు, ఫాస్ట్, స్లో మోషన్‌లు లేకుండా సింగిల్ స్ట్రీక్‌లో ఫిల్మింగ్ చేశాం. ఈ టైప్‌లో ‘మహాప్రస్థానం’ మూవీ తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డాం. 20 రోజుల కాల్షీట్లు కేవలం రిహార్సల్స్ చేసేందుకే పట్టాయి. రోజంతా రిహార్సల్స్ చేసి రాత్రి షూటింగ్ చేస్తూ వచ్చాం. కెమెరామెన్ ఎంఎన్ బాల్‌రెడ్డి చాలా కష్టపడ్డారు. హీరో తనీష్ ఎంతో కోపరేట్ చేశారు. ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. నెల రోజుల ముందే సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి సెట్‌లోకి వచ్చారు. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్, సీజీ పనులు చివరి దశలో ఉన్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యేలా ఉంటే థియేటర్ రిలీజ్ లేదా ఆలస్యమైతే ఓటీటీలో మా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అని అన్నారు. Also Read: హీరో తనీష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఫస్ట్ తేజ్ అన్నకు థాంక్స్ చెప్పాలి. తను బిజీగా ఉన్నా మా సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు. టీజర్ చూసి బాగుందని ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇప్పటిదాకా సింగిల్ షాట్ ప్యాట్రన్‌లో ఇండియన్ కమర్షియల్ మూవీ రాలేదు. ఇలాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది. ఈ టైప్ సినిమా చేయడం కష్టం.. ఎందుకంటే షాట్ పెట్టాక సీన్‌లోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫెక్ట్‌గా చేయాలి. లేకుంటే మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చేది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్యాషన్‌తో పనిచేశారు. హీరోలు, విలన్లు అనే కాన్సెప్ట్ కంటే.. సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని కథను కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు జాని. ప్రతి నిమిషం మీరు ఆ సినిమాలో ఉన్నట్లు ఫీలవుతారు. డిఫరెంట్ ఓటీటీల వాళ్లు మాట్లాడుతున్నారు. త్వరలోనే మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు వసంత కిరణ్, యానాల శివ రాశారు. ప్రణవం సాహిత్యం అందించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. ఎంఎన్ బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్. క్రాంతి (ఆర్కే) ఎడిటర్. శివ ప్రేమ్ ఫైట్స్ కంపోజ్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i6bAqf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...