గాన గంధర్వుడు మరణం సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి భారతీయ సినీ పరిశ్రమ మొత్తం షాకైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఆయన అభిమానులు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బాలు పార్థివదేశాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన కుమారుడు చరణ్ ఇంటికి అశ్రునయనాల మధ్య తరలించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలో ఏర్పాట్లు చేశారు. బాలును కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. మరోవైపు రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZiNTM
v
No comments:
Post a Comment