Monday, 7 September 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టానన్న మెగా బ్రదర్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మెగా బ్రదర్ పాల్గొన్నారు. కమెడియన్, మాజీ జబర్దస్త్ ఆర్టిస్ట్ చమ్మక్ చంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నాగబాబు.. మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యాను. ఈ సందర్భంగా టీవీ ఆర్టిస్టులు భరణి, కల్కి రాజాకు ఈ ఛాలెంజ్‌ను నేను విసురుతున్నాను. వాళ్లు కూడా మొక్కలు నాటాలని కోరుతున్నాను’’ అని నాగబాబు చెప్పారు. Also Read: మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను 20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టానని నాగబాబు అన్నారు. తనకు ఒక ఎకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కూడా ఉందని చెప్పారు. అలాగే, మెగా ఫ్యాన్స్‌తో కలిసి పలు చోట్ల 10వేల మొక్కలకు పైగా నాటించామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంతో పాటు పలు చోట్ల మొక్కలు నాటామన్నారు. తాను స్వయంగా జీడిమెట్ల ప్రాంతంలో 11 ఎకరాలు కొనుగోలు చేసి 14 వేల మొక్కలు వరకు నాటి దగ్గరుండి పెంచానన్నారు. అది కెమికల్ డంపింగ్ యార్డ్ కావడంతో శుభ్రంగా మట్టిపోయించి మొక్కలు నాటామన్నారు. మొత్తం ఓ 20 వేల మొక్కలు నాటుంటానని.. 50 వేలు మొక్కలు నాటడం తన ధ్యేయమని చెప్పారు. కోటి మొక్కల రామయ్య తనకు స్ఫూర్తి అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R4Ws0t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...