Sunday, 23 August 2020

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

రౌడీ స్టార్, సెన్సేషనల్ హీరో . అబ్బో.. మనోడి గురించి చెప్పాలంటే బోలెడంత మ్యాటర్ ఉంది లెండి. టాలీవుడ్ హీరోల్లోకెల్లా అత్యంత స్పీడ్‌గా తనకంటూ సొంతంగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఈ హీరో తాజాగా ఓ రేర్ ఫీట్ అందుకున్నారు. ఈ ఫీట్ ద్వారా తెలుగు హీరోల్లో తానే స్పెషల్ అంటూ మరోసారి రుజువు చేసుకున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటారా..? ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' లిస్టులో టాలీవుడ్ నుంచి నేనొక్కడినే అంటూ టాప్ 10లో నిలిచారు. ఆన్‌లైన్‌ ద్వారా 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' పోటీని నిర్వహించింది టైమ్స్ మీడియా. ఇందులో సినీ స్టార్స్, క్రికెట్ స్టార్స్ లకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత టాప్ 50 లిస్టు ప్రకటించగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మూడో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా టాప్ 10 లిస్టు చూస్తే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ ఒక్కరే అందులో స్థానం సంపాదించారు. బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాల్లో చోటు దక్కించుకోగా ఆ తరువాత విజయ్ దేవరకొండనే నిలవడం విశేషం. Also Read: గతంలోనూ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాలకు గాను నెంబర్‌వన్ స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఇండియన్ వైడ్ లిస్టులోనూ సత్తా చాటారు. అంటే మనోడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lcCPS3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...