Thursday, 20 August 2020

SSR Case: సుశాంత్- సారా అలీఖాన్ ఘాడ‌ ప్రేమ.. ఆ తర్వాత!! రహస్యాలు బయటపెట్టిన స్నేహితుడు శామ్యూల్

బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య తర్వాత ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలు బయట పడుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయన్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపణలు రావడంతో ఈ కేసును కీలకంగా తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ తాజాగా పలు రహస్యాలు వెల్లడించాడు. ఒకానొక సమయంలో సుశాంత్, హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారంటూ ఆయన చెప్పిన విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read: కేదార్‌నాథ్ సినిమాలో సుశాంత్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ దగ్గరై ఘాడంగా ప్రేమించుకున్నారని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ అన్నాడు. ''కేదార్‌నాథ్ మూవీ పూర్తయి ప్రమోషన్ సమయానికి సుశాంత్- సారా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే సుశాంత్ తదుపరి చిత్రం సోన్‌చిరియా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో వెంటనే సుశాంత్‌తో సారా అలీఖాన్ బ్రేకప్ చేసుకుంది. ఆ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. సోన్‌చిరియా ఫ్లాప్ అవ్వడానికి బాలీవుడ్ మాఫియానే కారణం'' అని శామ్యూల్ హోకిప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. ఇక ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన శామ్యూల్ హోకిప్.. సుశాంత్- సారా ప్రేమాయణానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటపెట్టాడు. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ నడిచినప్పుడు చిన్న పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ కనిపించేదని, కేవలం ప్రేమనే కాకుండా వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవం ఉండేదని, ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొననే వారని చెప్పాడు. అయితే సుశాంత్, సారా బ్రేకప్‌కి కారణం రియా చక్రవర్తే అని శామ్యూల్ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ కూడా వారి ప్రేమను వ్యతిరేకిస్తూ హెచ్చరించినట్లు శామ్యూల్ పేర్కొన్నాడు. దీంతో సుశాంత్ ఆత్మహత్య తర్వాత బయటకొస్తున్న ఈ విషయాలు మరో సంచలనంగా మారాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YlqAbO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...