Saturday, 8 August 2020

Shruti Haasan: టేక్ మి టేక్ మి టు ఎడ్జ్.. శృతిహాసన్ హంగామా మామూలుగా లేదు బాబోయ్!!

‘టేక్ మి టేక్ మి టు ’ అంటూ తెగ హంగామా చేసింది హీరోయిన్ శృతి హాసన్. చిన్నతనం నుంచే మ్యూజిక్, సింగింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ బ్యూటీ.. హీరోయిన్ కావ‌డానికి ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే వ‌ర్క్ చేసింది. ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తనకిష్టమైన మ్యూజిక్‌పై నిత్యం ఫోకస్ పెడుతూనే ఉంది. ఏ మాత్రం సమయం దొరికినా మ్యూజిక్ వింటూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన 'ఎడ్జ్' ఆల్బమ్ రిలీజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా ఖాళీ సమయం దొరకడంతో సంగీతంపైనే దృష్టి పెట్టిన శృతి హాసన్.. ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ రెడీ చేసింది. ఈ ఆల్బమ్ కోసం లిరిక్స్ రైటింగ్ మొదలుకొని సాంగ్ కంపోజింగ్, మ్యూజిక్ అన్నీ తానై చూసుకుంది శృతి హాసన్. తాజాగా ఈ ఆల్బమ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుంచిన ఆమె.. 'ప్ర‌తి ఒక్క‌రిలో అసంపూర్ణ‌మైన ప్రేమ‌ను తెలియ‌జేప్పే ప్ర‌య‌త్న‌మే ఇది' అని పేర్కొంది. ఈ వీడియోలో ''టేక్ మి టేక్ మి టు ఎడ్జ్'' అంటూ ఫుల్లుగా హంగామా చేస్తూ ఆకట్టుకుంది శృతి. ప్రియుడు మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శృతి హాసన్ కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది. రీసెంట్‌గా అతనితో బ్రేకప్ చేసుకొని తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటించింది. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించినట్లు టాక్. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aeCIjO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...