Saturday, 8 August 2020

Lakshmi Manchu: మంచు లక్ష్మి నయా ప్లాన్.. తమ్ముడు విష్ణుతో కలిసి స్కెచ్! అల్లు వారి పైనే ఫోకస్..

డిజిటల్ మాధ్యమానికి, ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు, నటీనటుల చూపు అటువైపుగా పడుతోంది. కరోనా కల్లోలంతో థియేటర్స్ మూతబడ్డాక వీటికి డిమాండ్ మరింత పెరిగింది. ఇంట్లోనే కూర్చొని ఓటీటీ వేదికలపై సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో థియేటర్స్‌కి గడ్డు పరిస్థితే అనే సందేహం కలుగుతోంది. Also Read: ఈ క్రమంలో ఓటీటీ డిమాండ్ క్యాష్ చేసుకునేలా ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' వేదికను ప్రారంభించి ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా పలు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ కొత్త మాంచి బిజినెస్ లాభదాయకంగా ఉందట. దీంతో టాలీవుడ్‌కి చెందిన మ‌రికొంత మంది నిర్మాత‌లు ఓటీటీలు స్టార్ట్ చేస్తార‌నే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. అందులో ముందువరుసలో ఉందట మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. అచ్చం అల్లు వారిలాగే సినిమాల్లో నటించడంతో పాటు ఆ నిర్మించడంలోనూ అనుభవమున్న మంచు వారు కొత్తగా ఓ ఓటీటీ ప్రారంభించేలా స్కెచ్ రెడీ చేశారట. హీరో, నిర్మాత అయిన ఓటీటీ ప్రారంభించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు ఫిలిం నగర్ టాక్. అక్క మంచు ల‌క్ష్మీ సహకారంతో సొంతంగా ఓ వేదికను సిద్ధం చేసి కొన్ని వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మంచు వారసులు. గతంలో మంచు విష్ణు ‘చ‌ద‌రంగం’ అనే వెబ్ సిరీస్‌ చేసి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5కి అందించారు. సో.. చూడాలి మరి మంచు వారు వేసిన ఈ స్కెచ్ ఎన్ని రోజుల్లో అమలులోకి తెస్తారో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31unV0d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...