Sunday, 23 August 2020

Samantha: మామకు ప్రేమతో.. నాగార్జున కోసం సమంత.. లవ్ ఫరెవర్ అంటూ కానిచ్చేసింది

అక్కినేని కోడలు సోషల్ మీడియాలో ఎంత హుషారుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు అక్కినేని ఫ్యామిలీ సంగతులు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో హంగామా చేయడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా మామ కోసం ఓ స్పెషల్ ప్లాన్ చేసి.. ఆయన బర్త్ డే హంగామాను తన చేతుల మీదుగానే స్టార్ట్ చేసేసింది. ఆగష్టు 29న రానున్న నాగార్జున బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది సమంత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున కామన్ డీపీ పోస్ట్ చేసిన సామ్.. ''కింగ్ నాగార్జున బర్త్ డే డీపీ రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయనపై నా ఎల్లవేళలా ప్రేమ, గౌరవం ఉంటుంది. అందరి గుండెల్లో ఎప్పుడూ ఆయన రాజే'' అని పేర్కొంది సమంత. ఆమె విడుదల చేసిన ఈ డీపీలో నాగార్జున సినిమాల్లో అన్ని గెటప్స్ పొందుపరిచి అక్కినేని అభిమానులకు కిక్కిచ్చారు. దీంతో అశేష అభిమాన వర్గం ఈ డీపీని వైరల్ చేస్తూ తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. Also Read: ఈ మధ్యకాలంలో సినిమాల వేగం తగ్గించిన నాగార్జున.. మరికొద్ది రోజుల్లోనే బుల్లితెరపై హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ElRFot
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...