Sunday, 23 August 2020

బ్యూటిఫుల్ హీరోయిన్‌ని టార్గెట్ చేస్తూ వల్గర్ పోస్టులు.. చిరవకు బుక్కయ్యాడిలా!

సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరగాళ్లు, ఆన్‌లైన్ కేటుగాళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సైబర్ రూల్స్ అతిక్రమిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించడం, సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులకు పాల్పడటం లాంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సైబర్ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఈ కేటుగాళ్లు లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హపై వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఓ యువకుడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో సోనాక్షిని అసభ్య పదజాలంతో దూషిస్తూ వల్గర్ పోస్టులు పెట్టి రెచ్చిపోయాడు. ఆ పోస్టులు చూసిన వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: ఆ వ్యక్తి ఔరంగబాద్‌కు చెందిన శశికాంత్ గులాబ్ జాదవ్‌గా గుర్తించారు పోలీసులు. ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద పలు అతనిపై కేసులను నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది సోనాక్షి సిన్హా. ఈ మేరకు ఆన్‌లైన్ ప్రపంచం సేఫ్‌గా ఉండే వరకూ తాను సైలెంట్‌గా ఉండనని, సోషల్ మీడియాలో వేధింపులను ఏ ఒక్కరూ సహించకూడదని, వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని పేర్కొంది సోనాక్షి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l6LYeV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...