Friday, 7 August 2020

RRR నిర్మాత దానయ్యకు కరోనా పాజిటివ్

భారీ పాన్ ఇండియా చిత్రం ‘RRR’ను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య కరోనా బారిన పడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతోన్న దానయ్యకు పరీక్షలు నిర్వహించారు. ఆ టెస్ట్ రిపోర్ట్ శుక్రవారం వచ్చింది. ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దానయ్య ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. RRR టీమ్ నుంచి ఇప్పటికే దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే, ఎవరికీ పెద్దగా లక్షణాలు లేవని.. తాము ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు రాజమౌళి ప్రకటించారు. ప్రస్తుతం రాజమౌళి కుటుంబం కోలుకుంటోంది. రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడే చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇప్పుడు దానయ్యకు కూడా కరోనా సోకడంతో చిత్ర యూనిట్ కంగారు పడుతోంది. Also Read: టాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత కరోనా బారినపడటం ఇదే తొలిసారి. టాలీవుడ్ నుంచి నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు మొదట కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన తరవాత ఒక్కొ్క్కరిగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. దర్శకుడు తేజ, సింగర్ స్మితకు కూడా ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న పరిస్థితి చూస్తుంటే RRR షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగ్ మొదలుపెట్టరనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అంటే, ఈ ఏడాది RRR షూటింగ్ మొదలుకానట్టే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30yBjkO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...