Friday, 7 August 2020

రాడ్ గోపాల్ వర్మ: ‘శివ’కు ముందు జరిగిన కథ.. బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్మాడా?

వెండితెరపై మనం రివేంజ్ డ్రామాలు చాలానే చూశాం. ఇప్పటి వరకు ఎన్నో రివేంజ్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కానీ, ఇప్పుడు మాత్రం బయట ఓ వ్యక్తిపై రివేంజ్ తీర్చుకోవడానికి ఆయనపై తెరపైకి సినిమాలు ఎక్కిస్తున్నారు. ఈపాటికే అర్థమై ఉంటుంది ఇక్కడ చెప్పుకునేది ఎవరి గురించో. నిన్న మొన్నటి వరకు ఆయన అందరినీ కెలికేశారు. సినిమా ఇండస్ట్రీలోని, రాజకీయాల్లోని, ఫ్యాక్షనిజంలోని ప్రముఖలందిరిపైనా సినిమాలు తీశారు. ఎవరేమనుకుంటే నాకేంటి అంతా నా ఇష్టం అంటూ తనకు నచ్చినట్టు కథలను తయారుచేసుకుని చూపించారు. అయితే, ఇప్పుడు బాధితుల వంతు వచ్చింది. పాటల రచయిత జొన్నవిత్తులతో మొదలైన ఈ తిరుగుబాటు ఇప్పుడు మెల్లగా ప్రత్యర్థులందరి దగ్గరకు పాకుతోంది. జొన్నవిత్తుల సినిమా ఇంకా రాకపోయినా.. దాని కన్నా ముందే కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ‘పరాన్నజీవి’ ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఇప్పుడు మరో వివాదాస్పద సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను టాలీవుడ్‌లోని పీఆర్వోల్లో ఒకరైన ఏలూరు శ్రీను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. Also Read: ఇంతకీ ఈ సినిమా టైటిల్ ‘రాడ్ గోపాల్ వర్మ’. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే మనకు చూపించారు. కానీ, ఇప్పుడు ఎవ్వరికీ తెలియని కథంటూ ఒక ఛాప్టర్‌ను చూపించబోతున్నారు. ‘శివ’ సినిమాకు ముందు జరిగిన కథట. ఈ విషయాన్ని టైటిల్‌ పోస్టర్‌లో స్పష్టం చేశారు. ‘పలు బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు’ అనే శీర్షికతో ఉన్న పేపర్ కటింగ్‌ను పోస్టర్‌లో పొందుపరిచారు. అంతేకాదు, ఆ పేపర్ కటింగ్‌లో పోలీస్ ఆఫీసర్ రెండు కాళ్ల మధ్య నుంచి ఆయన్ని నగ్నంగా కూర్చోబెట్టి చూపించారు. ‘‘ఆ రోజు రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ ఫిక్షనల్ రియాలిటీ ఫిలింను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే ట్రైలర్ వచ్చేస్తుంది’’ అని ఏలూరు శ్రీను తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కె.ఎస్.మణి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ijS8G4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...