Friday, 7 August 2020

Rana Marriage updates: రెడీ అంటూ బాంబు పేల్చిన రానా.. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్‌లతో అలా!!

దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ రోజు (శనివారం) రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రానా- మిహీక జోడీ ఒక్కటి కానున్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీలో సందడి వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బాబాయ్ విక్టరీ వెంకటేష్ కుటుంబం, రానా కుటుంబం అంతా కలిసి పెళ్లి మూడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బాబాయ్, తండ్రితో కలిసి దిగిన ఓ లేటెస్ట్ పిక్ షేర్ చేసి సింపుల్ కామెంట్‌తో అట్రాక్ట్ చేశారు పెళ్లి కొడుకు రానా. సాంప్రదాయ దుస్తుల్లో బాబాయ్ వెంకటేష్, తండ్రి సురేష్ బాబుతో హుషారుగా ఓ ఫొటోకు పోజిచ్చిన రానా.. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ''రెడీ'' అనే కాప్షన్ ఇచ్చి బాంబ్స్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో సురేష్ బాబు, వెంకటేష్, రానా ముగ్గురినీ అలా ఒకేచోట చూసిన దగ్గుబాటి ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ రానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కారణంగా రానా పెళ్లికి ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజరు కానున్నారని రానా తండ్రి సురేష్ బాబు పేర్కొన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులతో కలిపి అంతా కేవలం 30 నుంచి 50 మంది మాత్రమే హాజరవుతారని తెలిపారు. ఈ పెళ్లి వేడుక కోసం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోను ఎంతో అందంగా ముస్తాబు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DPtRZt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...