Saturday, 8 August 2020

Anchor Jhansi: పెద్దలకు మాత్రమే.. సెక్స్‌ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి.. యాంకర్ ఝాన్సీ ఆవేదన

యాంకర్ ఝాన్సీ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తనదైన మాటలతో బుల్లితెరపై, ఆకట్టుకునే నటనా ప్రతిభతో వెండితెరపై హవా నడిపించిన ఆమె గత కొంతకాలంగా కెమెరాకు దూరంగా ఉంటోంది. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్ర‌త్యేక‌మైన యాస‌లు ఉపయోగిస్తూ డైలాగ్స్ చెప్ప‌డం ప్ర‌త్యేక‌త‌. కాగా తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఝాన్సీ తన కెరీర్ సంగతులతో పాటు అప్‌‌కమింగ్ ప్రాజెక్టు వివరాలు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. తాను త్వరలోనే '' అనే కార్యక్రమం చేయబోతున్నట్లు తెలిపింది . అయితే ఇది అందరూ అనుకునే ప్రాజెక్టు కాదని చెప్పి ఆశ్చర్యపరిచింది. టీవీ, వెబ్‌ సిరీస్‌లు వచ్చాక అడల్ట్‌ కంటెంట్‌ అనగానే ‘శరీరం, హింస, క్రైమ్‌, సెక్స్‌’ వీటి గురించే ఆలోచిస్తున్నారు కానీ వాటిని మించిన మరో సబ్జెక్ట్ ఉందని.. దాన్నే ఈ ప్రోగ్రాంలో టచ్ చేస్తున్నామని తెలిపింది. మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెద్ద వాళ్లమైపోయామంటూ ఆవేద‌న చెందిన ఝాన్సీ.. వాటి గురించే కొత్త ప్రాజెక్ట్‌లో చర్చించనున్నట్లు చెప్పింది. Also Read: సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి జోగి నాయుడిని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఝాన్సీ ప్రస్తుతం తన త‌ల్లిదండ్రులు, కూతురుతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే తన కూతురితో ఎంతో సంతోషంగా ఉన్నానని, గత కొన్నేళ్లుగా నా వ్యక్తిగత జీవితంపై ర‌క‌ర‌కాల వార్త‌లు రాశార‌ని చెప్పుకొచ్చింది ఝాన్సీ. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా లెక్కచేయకుండా సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తున్నానని ఆమె తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kwyokL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...