Tuesday, 18 August 2020

Nivetha Thomas: ప్రభాస్‌తో నివేద థామస్ రొమాన్స్! పైకం కూడా ఎక్కువేనట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవలే సాహో మూవీతో ఆశించిన ఫలితం రాబట్టని ఆయన.. ఇకపై రెబల్ స్టార్ అభిమానులు హుషారెత్తిపోయేలా భారీ సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' మూవీ చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందట. ఇందుకోసం వేట ప్రారంభించిన నాగ్ అశ్విన్ వైపు మొగ్గుచూపారని టాక్. ఈ మేరకు ఆమె అడిగినంత రెమ్మ్యూనరేషన్ ఇవ్వడానికైనా వెనుకాడొద్దని నిర్మాతలతో చెప్పారట. Also Read: మరోవైపు ఇప్పటికే ఈ మూవీ కోసం హీరోయిన్ దీపికా పదుకొనేకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని విన్నాం. మళ్ళీ నివేదా విషయంలోనూ వెనక్కి తగ్గొద్దంటున్నారంటే ఈ మూవీని ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా రానున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రానికి స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మూవీ సాంకేతిక బృందం ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h2y0YV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...