మెగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. మెగాస్టార్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారో అని ఆసక్తికగా ఎదురుచూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరంజీవి 152వ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆగస్టు 22న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు నిర్మాత రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి చేయి విప్లవానికి ప్రతీక అయిన ఎర్ర కండువాను పట్టుకుని ఉంది. నిజానికి ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి పొరపాటున నోరుజారారు. అప్పటి నుంచీ ‘ఆచార్య’ టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. అయినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం #CHIRU152 గానే పిలుస్తోంది. అంటే, ఆగస్టు 22న విడుదల చేయనున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే చిరంజీవి లుక్, టైటిల్ లోగోను కూడా రిలీల్ చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. Also Read: శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q03Ycv
v
No comments:
Post a Comment