Monday, 24 August 2020

Murder: 'మర్డర్' కేసులో రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన కోర్టు.. ఉత్తర్వులు జారీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఆయన రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు. మూవీపై విడుదలకు ముందే వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటున్నారంటూ.. అలాగే ప్రశాంతంగా ఉన్న తమ బ్రతుకులను వర్మ బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ వర్మపై, మర్డర్ మూవీపై కంప్లైంట్ చేశారు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ చూస్తుంటే తమ కులాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. అదేవిధంగా హత్యకేసు విచారణ ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఇలాంటి సినిమా వచ్చిందంటే అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని వారు పేర్కొన్నారు. Also Read: ఈ పిటిషన్ పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా ఈ కేసు విషయమై హైకోర్టుకు వెళతామంటూ వర్మ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ మర్డర్ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QiHHXg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...