Tuesday, 11 August 2020

Kangana Ranaut: ఆ హీరోని ఎవ్వరూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయలేరు కానీ..! రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంలో బాలీవుడ్ హీరోయిన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బడా స్టార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది కంగనా. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ మాఫియాపై పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీ కేవలం కొందరు పెద్దల చేతుల్లోనే ఉందని, నెపోటిజం కారణంగా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ జీవితం ఇలా గుగ్గిపాలవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్ల మధ్య వివాదాలు పెద్దవవుతున్నాయి. Also Read: ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌, హీరోయిన్లు తాప్సి, స్వర భాస్కర్‌లపై విరుచుకుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. మరోసారి నోరువిప్పింది. అయితే ఈ సారి స్టార్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. హీరో స్త్రీ లోలుడు, దీపిక ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ''నిత్యం అమ్మాయిల వెంటపడే రణబీర్‌ను ఎవ్వరూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయరు. అలాగే తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా ప్రకటించుకున్న దీపికా పదుకొనేను ఎవ్వరూ సైకో, రాక్షసి అని అస్సలు అనరు. కానీ సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడుతూ హింసిస్తుంటారు'' అంటూ వివాదాస్పద పోస్ట్ పెట్టి సరికొత్త సంచలనానికి తెరలేపింది కంగనా. ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y5joAL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...