Saturday, 22 August 2020

Chiranjeevi Birthday: అందరి ట్వీట్లు ఓ లెక్క.. బండ్ల గణేష్ ట్వీట్ మరో లెక్క.. ఏం జన్మసార్ మీది!

ఎంతైనా బండ్ల గణేష్.. బండ్ల గణేషే. ఆయన పొగిడితే భలే మాజా ఉంటుందిలే. పవన్‌పై పొగడ్తల సంగతి సరేసరి.. ఇక మెగాహీరోలను పొగడాలంటే తరువాతే ఎవరైనా. ఇతని పొగడ్తలు చూసి వర్మ లాంటి దర్శకులు కుళ్లుకున్నా.. డమ్మీ పాత్రలు పెట్టి ఆయన్ని హేళన చేసినా.. మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు బండ్ల గణేష్. అవును మరీ.. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసేందుకు పెద్ద పెద్ద నిర్మాతలే పోటీ పడుతుంటారు.. అలాంటిది పిలిచి సినిమా ఇచ్చిన రుణం తీర్చుకోపోతే ఎలా? అందుకే బండ్ల గణేష్‌కి మెగా హీరోలు అన్నా మెగా ఫ్యామిలీ అన్నా.. ఇష్టం, ప్రేమ, పిచ్చి ఎక్సట్రా.. ఎక్సట్రా. నేడు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా చాలా మంది సెలబ్రిటీలు, మెగా హీరోలు, అభిమానులు ట్వీట్లు పెట్టి విషెష్ అందించారు. అయితే అందిరి విషెష్ ఓ లెక్క నా విషెష్ మరో లెక్క అన్నమాదిరిగా అదిరిపోయే ట్వీట్ పెట్టాడు బండ్ల గణేష్. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. చూస్తే చూడాలి మెగాస్టార్ సినిమా చూడాలి అని చిన్నప్పుడు అనుకునే నేను.. ఇపుడు తీస్తే తీయాలిరా.. మెగాస్టార్‌తో సినిమా తీయాలి అనిపిస్తుంది. ఏం జన్మ సార్ మీది సూపర్’ అంటూ విషెష్ అందిస్తూనే పనిలో పనిగా మీతో సినిమా తీయాలని ఉంది సార్ అని మనసులో కోరికను బయటపెట్టాడు బండ్ల గణేష్. అతని కోరిక తీరాలనే అనుకుందా!! అన్నట్టు ఆ ఫొటోలో చిరంజీవి కాళ్లపై పడుతున్నది మన బండ్ల గణేషే.. అభిమానులు ఈ ఫొటోని షేర్ చేయగా.. రీ ట్వీట్లు చేస్తూ లవ్ ఇట్ అనేశారు బండ్ల గణేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aM5tV8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...