Saturday, 22 August 2020

మా చిరు.. అంటూ రోజా ఆసక్తికర ట్వీట్, అవునవును ఆయన ఆదర్శమే

నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా విషెష్‌తో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ ఆయన అభిమానులు మిలయన్ల ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.. వినాయక చవితి రోజునే మెగాస్టార్ 65వ ఏట అడుగుపెట్టడంతో మెగా సంబరాలు రెట్టింపయ్యాయి. మెగాఫ్యాన్స్ రెండు పండుగలను ఒకేసారి విషెష్ అందిస్తుండగా.. టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, శ్రీకాంత్, శ్రీను వైట్ల, దేవిశ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, రాశీ ఖన్నా, సునీల్, కార్తికేయ, డైరెక్టర్ బాబీ, డైరెక్టర్ మారుతి, సత్యదేవ్ ఇలా టాలీవుడ్ మొత్తం మెగా విషెష్‌తో ట్విట్టర్‌ని హీటెక్కించారు. తాజాగా అలనాటి ‘జబర్దస్త్’ హీరోయిన్, వైసీపీ ఎమ్మెల్యే మెగాస్టార్‌కి బర్త్ డే విషెష్ అందించారు. బిగ్ బాస్, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘చామంతి పువ్వా.. పువ్వా.. చామంతి పువ్వా.. నీ బంతి పూల మేడ కట్టనా’.. అంటూ చిరుతో ఆడిపాడిన రోజా.. ‘మా చిరు’ అంటూ బర్త్ డే విషెష్ అందించారు. ‘స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచిన మా చిరు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు రోజా. అయితే ఇటీవల వైసీపీ పాలనపైన జగన్ సంక్షేమ పథకాలపైన పాజిటివ్‌గా స్పందించిన చిరంజీవికి వైసీపీ వర్గాలు బాగా దగ్గరౌతున్నాయి. గతంలో చిరుపై విమర్శలు గుప్పించిన వాళ్లే.. ఇటీవల జగన్‌తో చిరు భేటీ తరువాత పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l9H5Sc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...