నేటి (శుక్రవారం) ఉదయం ప్రముఖ టాలీవుడ్ రచయిత సతీమణి విజయలక్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నారు. తాజాగా (మా) తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. విజయలక్ష్మి గారి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మెగాస్టార్ సైతం పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు వెన్నంటే ఉంటూ ఆయన విజయంలో విజయలక్ష్మి కీలకపాత్ర పోషించిందని అన్నారు. Also Read: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ). పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరిలో పెద్దవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఎన్టీఆర్ కాలం మొదలుకొని నేటివరకు కథలు, డైలాగ్స్ రాయడంలో పరుచూరి బ్రదర్స్ ద్వయానికి తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30ynxyE
v
No comments:
Post a Comment