Thursday, 6 August 2020

ఆర్టీఏ ఆఫీసులో ప్రభాస్: అంతా హడావుడి.. కూల్‌గా ఫొటోలకు పోజులిచ్చిన బాహుబలి

పాన్ ఇండియా స్టార్ ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ చిత్రం తరవాత ‘రాధేశ్యామ్’ అనే లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా కెమెరాకు దూరమయ్యారు ప్రభాస్. జార్జియా షెడ్యూల్ పూర్తిచేసి ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ప్రభాస్.. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఎయిర్‌పోర్టులో మాస్క్‌తో కనిపించిన ప్రభాస్.. ఆ తరవాత మళ్లీ కెమెరా కంటికి చిక్కలేదు. అయితే, తాజాగా ప్రభాస్ ఇంటిలో నుంచి బయటికి వచ్చాను. తన కొత్తకారు రిజిస్ట్రేషన్ కోసం గురువారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ప్రభాస్ వెళ్లారు. ప్రభాస్ ఒక్కసారిగా ఆర్టీఏ కార్యాలయంలో కనిపించగానే అక్కడి ఉద్యోగులు, జనం అవాక్కయ్యారు. ఆఫీసులో ఉన్న కొంత మంది ఉద్యోగులు ప్రభాస్‌తో ఫొటోలు దిగారు. అలాగే, ఆర్టీఏ ఆఫీసులో పని కోసం వచ్చినవారు తమ మొబైల్ ఫోన్లలో బాహుబలిని బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోల్లో ప్రభాస్ మాస్క్ ధరించి ఉన్నారు. సింపుల్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. ఇదిలా ఉంటే, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను గత నెల 10న విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ పోస్టర్‌తో 24 గంటల్లోనే 6.3 మిలియన్లకు పైగా ట్వీట్లు చేసి రికార్డు సృష్టించారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gFrdEw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...