Thursday, 6 August 2020

ఆ కోరికతో ఇరవై యేళ్లకే పెళ్లి చేసుకున్నా.. తప్పు జరిగిపోయింది! రహస్యాలు బయటపెడుతూ ప్రగతి సంచలనం

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది సీనియర్ నటి . తన హాట్ హాట్ వర్కవుట్స్ వీడియోలు, డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌పై ఆమెకున్న ఇంట్రెస్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలతో పాటు లైఫ్ సీక్రెట్స్ చెబుతూ ఓపెన్ అయింది. తనకు చదువుకునేటప్పుడు పోలీస్ కావాలనే ఆశ ఉండేదని కానీ చదువులో వీక్‌గా ఉండటంతో అది సాధ్యం కాదని భావించి పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఆశ పడేదాన్నని ప్రగతి చెప్పింది. అలా ఆ ఆశతోనే ఇరవై యేళ్లకే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. కానీ అదే తన అహంకారానికి.. అలాగే పతనానికి కూడా ఆప్షన్ అయిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాతనే తప్పు చేశానని తెలిసిందని ఆమె పేర్కొంది. ‘‘పెళ్లయిన వెంటనే బాబు పుట్టాడు. ఆ వెంటనే కుటుంబ పోషణ, బరువు, బాధ్యతలు పెరిగాయి. సో.. బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కానీ నేను చదివిన చదువుకు కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా రాదని తెలుసు. నాకు తెలిసింది నటన ఒక్కటే. దీంతో కడుపుకాలి మళ్లీ సినిమాల్లోకే వచ్చేశాను’’ అని ప్రగతి తెలిపింది. కాబట్టి ఆర్ధికంగా సెటిల్ అయ్యాకనే మ్యారేజ్ చేసుకోవాలని.. మన లైఫ్‌కి ఏం కావాలో కూడా అర్థంకాని వయసులో పెళ్లి చేసుకోవడమంత చెత్త పని మరొకటి లేదని ఆమె పేర్కొంది. Also Read: మొదటగా ఓ యాడ్ షూట్ కోసం కెమెరా ముందుకొచ్చానని, ఆపై హీరోయిన్‌గా మారక వెంటనే పెళ్లి చేసుకోవడంతో ఆ కెరీర్ అలాగే ముగిసిపోయిందని ప్రగతి చెప్పింది. మ్యారేజ్ తర్వాత తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సినిమాల్లోకి ఎంటరై చాలా కష్టపడ్డానని చెప్పింది. మొదట హీరోయిన్ గా ఉన్నప్పుడు కష్టం విలువ తెలియలేదని, పెళ్లి తర్వాతనే కెరీర్‌ని సీరియస్‌గా తీసుకొని కష్టం అంటే ఏంటో తెలుసుకున్నానని చెప్పింది. దాంతో ఈ రోజు వరకూ కెరీర్ పట్ల అదే సీరియస్‌నెస్‌తో ఉన్నానని చెబుతూ కాస్త ఎమోషనల్‌గా ఫీల్ అయింది ప్రగతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30yhjin
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...