Friday, 21 August 2020

ఇతనే నా భర్త.. పక్కన నా బ్రదర్స్.. ఫొటోతో షాకిచ్చిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డికి పెళ్లైందా?? ఆ మాట అంటే ఆమె తెస్తే ఆమెకు కోపం వస్తుంది కాని.. గతంలో కూడా ఆమె పెళ్లిపై చాలా వార్తలు షికారు చేశాయి. ఆమెకు పెళ్లైందనీ.. తరువాత భర్తతో విభేదాలు రావడంతో దూరమయ్యారని వార్తలు రాగా.. వాటిని ఖండిస్తూ ఈ మధ్య తనకు అసలు పెళ్లే కాలేదని క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. అయితే గతంలో తల్లి మాత్రం శ్రీరెడ్డికి పెళ్లైందని టీవీ 9 చర్చావేదికలో బహిరంగంగానే తెలియజేశారు. సరే.. వాళ్ల పర్సనల్ లైఫ్ మనకెందుకులే కాని.. తాజాగా శ్రీరెడ్డి తన భర్తను పరిచయంచేసింది. నిండుగా చీరకట్టుకుని నుదుటున పాపిడిలో కుంకుమ అద్దుకుని కొత్త పెళ్లికూతురులా రెడీ అయ్యి ఫేస్ బుక్‌లో ఫొటో పెట్టింది శ్రీరెడ్డి. అదుగో ఫొటోలో నా వెనుక కనిపిస్తున్నాడే అతనే నా మంకీ హజ్బెండ్ (భర్త). ఆ పక్కన ఉన్నది నా బ్రదర్. అలాగే నా భర్త వెనుక మరో ఉన్నది మరో బ్రదర్’ అంటూ ఫేస్ బుక్‌లో ఫొటోతో సహా పోస్ట్ వదిలిసింది శ్రీరెడ్డి. అయితే నిజంగానే ఆ వెనుకనున్నది శ్రీరెడ్డి భర్తేనా అంటే నమ్మబుల్ కాదని ఆ సెటప్ చూస్తే అర్థమైపోతుంది. తాజాగా శ్రీరెడ్డి తెలుగులో మాదిరే తమిళ్‌లో కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. రీసెంట్‌గా ప్రమోషనల్ వీడియో కూడా తన స్టైల్‌లో వదిలింది. ఈ యూట్యూబ్ ఛానల్ కోసమే ఆమె ఇలా భార్య అవతారం ఎత్తి ఉంటుందనేది చాలామంది డౌటానుమానం. త్వరలోనే ఈ భార్యభర్తల సీక్రెట్‌ను కూడా రివీల్ చేయబోతుండగా.. ఇతనే నా భర్త అని శ్రీరెడ్డి పరిచయం చేయడంతో ఈ పోస్ట్‌కి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో వస్తున్నాయి. శ్రీరెడ్డికి పెళ్లైపోయిందోయ్ అని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తుంటే.. ఇంతకీ ఎన్నో భర్త అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32gWQy7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...