Sunday, 2 August 2020

ట్రైలజీగా రానున్న ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’.. ఈసారి ఎలాంటి కేసులో!!

న‌వీన్ పొలిశెట్టి టైటిల్ రోల్ పోషించిన ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రం విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ ద‌గ్గర భారీ విజ‌యం సాధించింది. త‌న సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆబాల‌గోపాలాన్ని అల‌రించారు న‌వీన్‌. టాలీవుడ్ షెర్లాక్ హోమ్స్ అన‌ద‌గ్గ ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ రానున్న రోజుల్లో మ‌రికొన్ని మిస్టీరియ‌స్ కేసుల్ని ఛేదించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ‘’ నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా తన పుట్టినరోజును పుర‌స్కరించుకొని ఆ సినిమా ట్రైల‌జీగా వ‌స్తుంద‌ని ప్రక‌టించారు. అంటే ఆ చిత్రానికి మ‌రో రెండు భాగాలు రానున్నాయ‌న్న మాట‌. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్‌జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. త‌ను డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా పూర్తవ‌గానే ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొద‌ల‌వుతుంది. మ‌రోవైపు, ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం రీమేక్ రైట్స్‌ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వర‌లో క‌న్నడ హ‌క్కులు కూడా అమ్ముడుకానున్నాయి. ఇంకో విశేష‌మేమంటే, ఈ సినిమా జ‌పాన్ భాష‌లో అనువాద‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 11న అక్కడ విడుద‌ల‌వుతోంది. ఇటీవ‌లి కాలంలో మ‌రే తెలుగు సినిమా ఇన్ని భాష‌ల్లో రీమేక్ కాలేద‌న్నది నిజం. ఇది ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ సాధించిన ఘ‌న‌త‌గా చెప్పుకోవ‌చ్చు. ఇలాంటి చిత్రానికి సంబంధించిన మ‌రో రెండు భాగాలు రానున్నాయ‌నే అనౌన్స్‌మెంట్‌ థ్రిల్లర్‌, కామెడీ సినిమాల‌ను ఇష్టప‌డే అభిమానుల‌కు ఆనందాన్ని చేకూర్చనుంది. Also Read: కాగా, త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ రెండో భాగం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త‌న రెండో సినిమా పూర్తవ‌గానే డైరెక్టర్ స్వరూప్ సెకండ్ పార్ట్‌ను చేప‌డ‌తారు. స్క్రిప్ట్ త‌యార‌వుతున్న విధానానికి మేం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాం. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు వెల్లడిస్తాం’’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k0SfrP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...