నటసింహా నందమూరి కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు వెతుకుతూనే ఉన్నారు. దీనిపై గత కొద్ది నెలలుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతారని కొన్ని రోజులు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ఫొటో బయటికి రావడంతో కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. అసలు మోక్షజ్ఞకు సినిమాలు అంటే ఆసక్తి లేదని, ఆయన బిజినెస్‌మేన్‌గా మారబోతున్నారని వదంతులు వచ్చాయి. అయితే, మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. 2021లో మోక్షజ్ఞ పరిచయం ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న వదంతుల ప్రకారం కొంత మంది రచయితలతో కలిసి బాలకృష్ణ స్వయంగా ఒక కథను డెవలప్ చేస్తున్నారట. ఇది మోక్షజ్ఞ పరిచయ చిత్రం కోసమే అని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరవాత డైరెక్టర్‌ను డిసైడ్ చేస్తారట. Also Read: మోక్షజ్ఞ కోసం తన సూపర్ హిట్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ ‘ఆదిత్య 999’ను బాలకృష్ణ సిద్ధం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ పనిచేస్తున్నది ఆ స్క్రిప్ట్ మీదే అని టాక్. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ‘ఆదిత్య 369’ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు ఇవ్వొద్దని ఇప్పటికే బాలకృష్ణకు అభిమానులు, స్నేహితులు సలహా ఇచ్చారట. సింగీతం శ్రీనివాసరావు ఆలోచనలు ఇప్పటి ప్రేక్షకులకు సరిపడవని వారు బాలయ్యకు సూచించారట. కాగా, వారాహి చలన చిత్రం యజమాని సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో మోక్షజ్ఞ పరిచయం ఉంటుందని అంటున్నారు. సాయి కొర్రపాటితో కలిసి ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సోషియో ఫాంటసీ సినిమా కోసం భారీ బడ్జెట్‌కు కూడా బాలయ్య వెనకాడరని టాక్. కాగా, ఈ సినిమా కోసం మోక్షజ్ఞను బరువు తగ్గాలని ఆయన తండ్రి బాలయ్య సూచించారట. త్వరలోనే ఒక ట్రైనర్ పర్యవేక్షణలో మోక్షజ్ఞ బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెడతారని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30kIg8N
v
No comments:
Post a Comment