మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఈసారి ఎలాంటి సినిమా వస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ బోలెడన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపిస్తారని కథకు సంబంధించి వదంతులు వ్యాపించాయి. విదేశాల్లో పుట్టిపెరిగిన హీరో తొలిసారి ఇండియాకు రావాల్సి వస్తుందని, ఆ తరవాత రాజకీయాల్లోకి వెళ్లాల్సి వస్తుందని కథపై రూమర్లు వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా ఇదని ప్రచారం జరిగింది. కానీ, దీనిలో నిజం లేదని తాజా సమాచారం. Also Read: ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని అంటున్నారు. అసలు ఈ సినిమా జోనర్‌ను ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో టచ్ చేయలేదని టాక్. తారక్ కోసం త్రివిక్రమ్ ఒక సరికొత్త జోనర్‌ను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అని.. ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్‌మేన్‌లా కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమా కథ ఒక పురాతన పాడుబడిన కోట చుట్టూ తిరుగుతుందట. ఆ కోటలోని గుప్త నిధుల చుట్టూ కథ నడుస్తుందని టాక్. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ఇలాంటి జోనర్‌లో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటేనే చాలా కొత్తగా అనిపిస్తోంది. రేపు తెరపై అదిరిపోవడం ఖాయం. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడు కానీ ఈ వదంతులో నిజమెంతో తేలదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఒక హీరోయిన్‌ను బాలీవుడ్ నుంచి తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నట్టు టాక్. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pgcm74
v
No comments:
Post a Comment