Sunday, 2 August 2020

సర్‌ప్రైజ్ ఇవ్వబోతోన్న యాంకర్ సుమ.. బిగ్ అనౌన్స్‌మెంట్!

బుల్లితెర యాంకర్లకు బాస్ ఎవరంటే కనకాల అని ఎవరైనా టక్కున చెబుతారు. ఆమె ఏ షో చేసినా, ఏ లైవ్ ప్రోగ్రాం చేసినా హడావుడిగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందుకే సుమకు బోలెడంత ఫాలోయింగ్. ఇప్పటి వరకు టీవీ, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తోన్న సుమ.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి కూడా అడుగుపెడుతున్నారు. దీనిపై రేపు (ఆగస్టు 3న) స్పష్టత రానుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు సుమ. ఈ మేరకు ఆహా సోషల్ మీడియా ద్వారా ఆదివారం ప్రకటించింది. రేపు సాయంత్రం 5 గంటలకు ఆహా ఫేస్‌బుక్ అకౌంట్‌లో సుమ లైవ్ నిర్వహించనున్నారు. ఈ లైవ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హాస్యనటుడు హర్ష, తదితరులు పాల్గొంటారు. ఈ లైవ్ ప్రోగ్రాంలో చాలా సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారట సుమ. అవేంటో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కొవిడ్ కారణంగా సుమారు మూడు నెలలకు పైగా షూటింగ్‌కు దూరమైన సుమ.. ఇటీవల మళ్లీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ‘క్యాష్’, ‘స్టార్ మహిళ’ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఆమె షూటింగ్‌ల్లో పాల్గొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు సుమ. అయితే, ఆమె ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంతో జతకట్టడం ఆసక్తికర అంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i2DqTE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...