Monday, 3 August 2020

సుశాంత్ సోదరి ఎమోషనల్ ట్వీట్.. రక్షాబంధన్ ఫోటోలు వైరల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి మరో ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ సందర్భంగా శ్వేతాసింగ్ కీర్తి ఓ పోస్టు పెట్టారు. రాఖీ పర్వదినం సందర్భంగా సుశాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు. ‘హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్’ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. Read More: సోషల్ మీడియా ద్వారా శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా గతంలో సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. ఇందులో సుశాంత్ చిన్న నాటి ఫోటోలను షేర్ చేశారు. కుర్చీలో కూర్చున్న సుశాంత్‌తో అతని తల్లి అక్కచెల్లెలందరికీ రాఖీ పండగ రోజున డబ్బులు ఇస్తున్న ఫోటోను సుశాంత్ సోదరి శ్వేతా షేర్ చేశారు. ఇందులో సుశాంత్ టీనేజ్‌లో ఉన్న ఫోటో కూడా ఉంది. తన అక్క చేత అతడు రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా శ్వేత సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. అటు బీహార్ పోలీసులకు కూడా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అతని తండ్రి ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఎకౌంట్లు డబ్బులు మాయం అవ్వడం పట్ల ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అని ఇప్పటికే అనేకమంది ప్రముఖులు సైతం ఆరోపించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ka3b6K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...