Sunday, 9 August 2020

వర్మ ‘డేంజరస్’: లెస్బియన్ లవ్ స్టోరీ.. ఘాటుగా అప్సర రాణి, నైనా గంగూలీ

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోజుకో సినిమాను ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ వల్ల ఆయనకి వచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది. ఓ వర్గం ప్రేక్షకుల నాడిని పట్టుకున్న వర్మ వారికి నచ్చేలా చిన్న చిన్న సినిమాలు తీస్తూ ‘ఆర్టీవీ వరల్డ్ థియేటర్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో విడుదల చేసి బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పటికే శృంగారభరితమైన క్రైమ్ స్టోరీలు తీసి ప్రేక్షకులకు చూపించిన వర్మ.. ఇప్పుడు మరో వెరైటీ రొమాంటిక్ ఫిల్మ్‌ను తీసుకొస్తున్నారు. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ. ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలతో ఓ రేంజ్ ఎక్స్‌పోజింగ్‌ను చూపించిన వర్మ.. మరో రొమాంటిక్ మూవీ ‘థ్రిల్లర్’ను సిద్ధం చేశారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇద్దరు బ్యూటీలతో ఓవర్ డోస్‌ రొమాన్స్, ఎమోషన్‌తో ‘డేంజరస్’ అంటూ వస్తున్నారు. ‘బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో ఈ ‘డేంజరస్’ మూవీని రూపొందిస్తున్నారు వర్మ. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆదివారం ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వరుసపెట్టి పోస్టర్లు, స్టిల్స్‌తో ట్విట్టర్‌ను హీటెక్కించారు. Also Read: ఈ పోస్టర్లలో ఘాటు అందాలతో అప్సర, నైనా పిచ్చెక్కిస్తున్నారు. అందాలు ఆరబోస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారు. విచిత్రమేమిటంటే ఒంటినిండా గాయాలతో కూడా లిప్‌ లాక్‌లు పెట్టుకుంటున్నారు. ఇక వర్మ స్టైల్ కెమెరా యాంగిల్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని వర్మ చెబుతున్నారు. ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందట. వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PC8iOP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...