Tuesday, 11 August 2020

రామ్ గోపాల్ వర్మకు కరోనా.. ‘మర్డర్’ కేసు విచారణకు డుమ్మా

రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ సోకిందని, ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వచ్చిన వార్తలను ఖండిస్తూ, మీడియాపై సెటైర్లు వేస్తూ ఈ మధ్య ఈ సంచలన దర్శకుడు ఒక వీడియో వదిలారు. చేతిలో డంబెల్ పట్టుకుని వర్కౌట్స్ చేస్తూ తాను చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానంటూ వెల్లడించారు. కానీ, వర్మకు కరోనా వైరస్ సోకిందని ఆయన లాయర్ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విన్నవించారు. కరోనా సోకిన కారణంగా తన క్లయింట్ విచారణకు హాజరుకాలేకపోయారని తెలిపారు. తన అనుమతి లేకుండా తన జీవిత కథపై ‘మర్డర్’ అనే సినిమాను తీస్తున్నారని, తనను బజారుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. Also Read: కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని వర్మ న్యాయవాదిని కోర్టు అడగగా.. తన క్లయింట్‌కు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. మరి ఆరోజైనా వర్మ కోర్టుకు వస్తారో లేదో చూడాలి. ‘మర్డర్’ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వర్మ పర్యవేక్షిస్తున్నారు. అలాగే, చిత్ర నిర్మాణంలో ఆయనకి భాగముంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31ILMt4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...