Wednesday, 12 August 2020

బుచ్చినాయుడు కండ్రిగ: పరువు చుట్టూ తిరిగే ప్రేమకథ.. పక్కా నెల్లూరు యాసలో..!

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో చిన్న చిన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. దీనికి కారణం ఓటీటీ ప్లాట్‌ఫాంలు. ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ఇంట్లో ఉండే చూడొచ్చు కాబట్టి ఓటీటీలో వచ్చే చిన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. 100 శాతం తెలుగు కంటెంట్‌‌ను అందిస్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ఇప్పటికే ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ప్లాట్‌ఫాంలో మరో మంచి చిత్రం రాబోతోంది. ఆ చిత్రం టైటిల్ ‘బుచ్చినాయుడు కండ్రిగ’. ‘తూర్పు వీధి..’ అనేది ఉపశీర్షిక. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పమిడిముక్కల చంద్రకుమారి నిర్మించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మున్నా, దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రవి వర్మ, ‘కంచరపాలెం’ రాజు, ప్రభావతి, పవిత్ర ముఖ్య పాత్రలు పోషించారు. 1994 నుంచి 2004 మధ్య జరిగిన కథగా సినిమాలో చూపించారు. పరువు నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. అలాగే, ఎమోషన్స్‌కు కూడా పెద్ద పీట వేశారు. పక్కా నెల్లూరు యాసలో సినిమా ఉంటుంది. ‘బుచ్చినాయుడు కండ్రిగ’ సినిమాను ఈనెల 21న ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. రామ్ కె మహేషన్ సినిమాటోగ్రఫీ అందించారు. మిహిరాంశ్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XTiLdi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...