Wednesday, 12 August 2020

మహేష్ బాబు హీరో అయితేనే నేను విలన్‌గా చేస్తా: విజయ్ కండిషన్‌ను గుర్తుచేసిన ఎ.ఆర్.మురుగదాస్

సూపర్ స్టార్ తన 45వ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన మహేష్.. ఈ ఛాలెంజ్‌కు తమిళ స్టార్ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, శృతిహాసన్‌ను నామినేట్ చేశారు. మహేష్ బాబు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దళపతి విజయ్ మంగళవారం చెన్నైలోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు మహేష్‌కు థ్యాంక్స్ చెప్పిన విజయ్.. మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. విజయ్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇటు విజయ్ అభిమానులు, అటు మహేష్ ఫ్యాన్స్ రీట్వీట్ల మీద రీట్వీట్లు చేశారు. ఇదే సమయంలో విజయ్, మహేష్ బాబుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. 2017లో వచ్చిన మహేష్ బాబు తొలి తమిళ చిత్రం ‘స్పైడర్’ ప్రమోషన్స్‌లో భాగంగా తీసిన వీడియో అది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్, హీరో మహేష్ బాబు ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించి వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అవడానికి కారణం.. మహేష్, విజయ్ గురించి మురుగదాస్ మాట్లాడటమే. Also Read: వీడియోలో మురుగదాస్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘స్పైడర్’ సినిమాకు ముందు మహేష్ బాబు, విజయ్‌తో ఓ భారీ మల్టీస్టారర్‌ను మురుగదాస్ ప్లాన్ చేశారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మించాలని ప్లాన్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరో, విజయ్ విలన్. మురుగదాస్ చెప్పిన ఐడియా ఈ ఇద్దరు హీరోలకు నచ్చింది. స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మురుగదాస్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే, భారీ బడ్జెట్ సినిమా కావడంతో పలు కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఈ సినిమాలో నటించడానికి దళపతి విజయ్ ఒక కండిషన్‌తో ఒప్పుకున్నారట. ఇదే ఇప్పుడు ఈ వీడియోలో హైలైట్‌గా మారింది. కేవలం మహేష్ బాబు హీరో అయితేనే తాను విలన్‌గా చేస్తానని విజయ్ కచ్చితంగా చెప్పారని మురుగదాస్ వెల్లడించారు. ఈ పాయింట్ మహేష్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో చాలా ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు, విజయ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. నిజానికి, తెలుగులో సూపర్ హిట్ అయిన రెండు మహేష్ బాబు చిత్రాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఒక్కడు’, ‘పోకిరి’ సినిమాల తమిళ రీమేక్‌లలో విజయ్ హీరోగా నటించారు. కాగా, ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి విలన్. మరోవైపు, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రారంభించారు. కొవిడ్-19 పరిస్థితి చక్కబడిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ixigNR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...