Monday, 3 August 2020

వెండితెరపై మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్.. వెండితెరపై కళ్ళకు కట్టినట్లుగా ఆర్తీ అగ‌ర్వాల్ జీవితం!

సిల్వర్ స్క్రీన్‌పై దివంగత నటీనటుల జీవితాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. దీంతో తెలుగుతో పాటు అన్ని ఇతర భాషల్లో బయోపిక్స్ హవా మొదలైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నట దిగ్గజాలు ఎన్టీఆర్, సావిత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బయోపిక్స్ రూపొంది అత్యంత ప్రజాధారణ పొందాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సమాచారం ప్రకారం కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో అకాల మరణం పొందిన సినీ నటి రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన ముద్దుగుమ్మ . కేవలం 18 ఏళ్ల వయసులోనే 2001లో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. ఆ వెంటనే 'నువ్వులేక నేనులేను' సినిమాలో తరుణ్‌తో జోడీ కట్టి మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత న్టీఆర్‌తో అల్లరి రాముడు, మహేష్ బాబుతో బాబీ, ఉదయ్ కిరణ్‌తో నీ స్నేహం సినిమాలు ఆమె కెరీర్‌ని అందలమెక్కించాయి. దీంతో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జునలతో సైతం నటించే అవకాశం కొట్టేసి స్టార్ హీరోయిన్ అయింది ఆర్తి అగర్వాల్. Also Read: అయితే ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడపడం, బ్రేక‌ప్‌, ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి సెటిల‌వ‌డం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అలా కొద్దికాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్ర‌య‌త్నాలు చేశారు అర్తీ అగ‌ర్వాల్. ఈ క్రమంలోనే బ‌రువు త‌గ్గ‌డానికి చేయించుకున్న లైపో ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో 2015, జూన్ 6న ఆమె క‌న్నుమూసింది. ఈ నేపథ్యంలో ఆర్తి అగర్వాల్ జీవితాన్ని వెండితెరపై కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని కొందరు దర్శకులు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ బయోపిక్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. అతిత్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ihj3CH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...