స్టైలిష్ స్టార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బిగ్ ఫైట్ చేయబోతున్నారట. అంతేకాదు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం చూడబోతున్నామాట. ఇందుకోసమే డైరెక్టర్ పక్కా ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఏంటి.. నిజమా అనుకుంటున్నారా? అవును నిజమే.. కాకపోతే రియల్ రాజకీయాలు కాదు, రీల్ రాజకీయాలు. సామాజిక కోణంలో సినిమాలు రూపొందించే కొరటాల శివ.. అల్లు అర్జున్‌తో చేయబోతున్న కొత్త సినిమా కోసం ఈ స్కెచ్ వేశారనేది తాజా సమాచారం. Also Read: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్న అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఓ ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసి బన్నీ- కొరటాల సినిమాను కన్ఫమ్ చేశారు. దీంతో ఈ విలక్షణ కాంబో స్టోరీ లైన్ ఏంటనే దానిపై అందరి కళ్ళు పడ్డాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ మేరకు ఈ మూవీ విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. గ్యాస్ లీకేజ్‌తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనను చూపిస్తూ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నారట. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బిగ్ ఫైట్ చేసే యువకుడిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ డిజైన్ చేశారని సమాచారం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా వెండితెరపై చూపించబోతున్నారని టాక్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. మరోవైపు అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఫినిష్ కాగానే బన్నీ- కొరటాల శివ సెట్స్ మీదకు రానుంది. ఓటమి ఎరుగని దర్శకుడు, స్టార్ హీరో కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31hbhBz
v
No comments:
Post a Comment