Tuesday, 25 August 2020

ఆర్జీవీకి హైకోర్టులో ఊరట.. ‘మర్డర్’ సినిమాపై కీలక ఆదేశాలు

సంచ‌ల‌నాలు, వివాదాస్పద చిత్రాల ద‌ర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ నుంచి వస్తున్న మ‌ర్డర్ సినిమా విడుద‌ల‌ను ఆపేయాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వులను స‌వాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టు దర్మాసనం మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. కోర్టు త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేంత‌వ‌ర‌కు రామ్ గోపాల్ వ‌ర్మపైగానీ, నిర్మాత‌ న‌ట్టి క‌రుణ‌పై గానీ, ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌ద్దని మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: అయితే, న‌ల్గొండ జిల్లా మిర్యాలగూడలో జ‌రిగిన ప్రణ‌య్ హ‌త్య కేసు ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'మ‌ర్డర్' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ ప్రణ‌య్ తండ్రి బాలాస్వామి మిర్యాల‌గూడ‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాక, ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ ఆగస్టు 6వ తేదీన ప్రణయ్ భార్య అమృత న‌ల్గొండ‌లోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ప్రణ‌య్ హ‌త్య కేసులో తీర్పు వ‌చ్చేంతవ‌ర‌కూ మ‌ర్డర్ చిత్రం విడుద‌ల నిలిపివేయాల‌ని తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై సవాలు చేస్తూనే రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకు వెళ్లగా ఆయనకు ఊరట లభించింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34AttJN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...