Tuesday, 25 August 2020

బాలు హెల్త్ అప్డేట్ టుడే.. అభిమానులకు ఎస్పీ చరణ్ రిక్వెస్ట్

లెజెండరీ సింగర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీడియాతో పంచుకుంటున్నారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్. కరోనా వ్యాధితో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఈనెల 5 నుంచి చికిత్స తీసుకుంటున్నారు ఎస్పీ బాలు. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఎస్పీ బాలు ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురౌతుండటంతో ప్రతి రోజు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అయితే మంగళవారం నాడు బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ట్రీట్ మెంట్‌కి సహకరిస్తున్నారని తెలియజేశారు చరణ్. బాలుని మామూలు మనిషిని చేయడానికి ఎంజీఎం వైద్యులు చాలా కష్టపడుతున్నారని వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు చరణ్. ఈ సందర్భంగా అభిమానుల్ని రిక్వెస్ట్ చేశారు చరణ్. ఆయన మాట్లాడుతూ.. ‘చాలా మంది నాన్న క్షేమ సమాచారాన్ని తమిళంలో తెలియజేయాలని కోరుతున్నారు... కాని నాన్నకు ఒక్క తమిళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వేల పాటలు పాడటం వల్ల.. నాన్న ఆరోగ్య పరిస్థితిపై వాళ్లు కూడా ఆందోళలనకు గురౌతున్నారు.. అందుకే అందరికీ ఆయన క్షేమ సమాచారం అందాలనే ఇంగ్లీష్‌లో తెలియజేస్తున్నా.. అన్ని భాషల్లోనూ అప్డేట్స్ అందించడం.. ఇలాంటి పరిస్థితుల్లో కష్టం.. నేను చెప్పేది అర్థం కాని వారు.. అర్థమైన వారి నుంచి తెలుసుకుంటారని కోరుకుంటున్నా.. అందరి ప్రార్ధనలతో నాన్న గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని అన్నారు ఎస్పీ చరణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Envyhq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...