Thursday, 6 August 2020

ఆ అమ్మాయి హ్యాండిచ్చింది.. కాలేజీ రోజుల్లో మేమిద్దరం! లవ్ సీక్రెట్స్ చెప్పేసిన సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్‌లో వరుస పెట్టి యంగ్ హీరోలంతా పెళ్లి చేసుకుంటున్న క్రమంలో అందరి దృష్టి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌పై పడింది. 33 ఏళ్ల ఈ హీరో పెళ్లి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో రానా లాగే ఈ యువ హీరో కూడా ప్రేమించిన యువతిని పరిచయం చేసి షాకిస్తారా? లేక నిఖిల్, నితిన్ లాగే డైరెక్టుగా పెళ్లి పీటలెక్కి సర్‌ప్రైజ్ చేస్తారా? అనే కోణంలో చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ ప్రేమ సంగతులు చెప్పారు . తన జీవితంలో ప్రేమదేశం లాంటి స్టోరీ ఉందని.. ఆ లవ్ స్టోరీలో చాలా ట్విస్టులున్నాయని పేర్కొంటూ ఓపెన్ అయ్యారు సాయి ధరమ్ తేజ్. కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయినే తన ఫ్రెండ్ కూడా లవ్ చేశాడని.. ఇద్దరం ఒకరికి తెలియకుండా మరొకరం ఆమెను బాగా ఇష్టపడ్డామని, అదే విషయమై గొడవ కూడా పెట్టుకున్నామని చెప్పారు. అయితే కొన్నాళ్లకు ఆ అమ్మాయి కాలేజ్ వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఇద్దరం చాలా బాధపడ్డామని అన్నారు. అలా ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్‌తో బాండింగ్ మరింతగా పెరిగిందని చెప్పి ఆశ్చర్యపరిచారు సాయి ధరమ్ తేజ్. Also Read: ఇటీవలే 'ప్రతిరోజు పండగే' సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ చేస్తున్నారు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ సినిమా నుంచి ''నో పెళ్లి'' వీడియో సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరోల వరుస పెళ్లిళ్ల నేపథ్యంలో ఈ 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీకి సూపర్ బజ్ క్రియేట్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a23r2S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...