Thursday, 27 August 2020

నందు, ర‌ష్మి జంట‌గా ‘బొమ్మ బ్లాక్‌బ‌స్టర్’.. పక్కా ఎంటర్‌టైన్మెంట్ గ్యారంటీ

హీరో నందు విజయ్ కృష్ణ, డ‌స్కీ బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ జంట‌గా ఓ సినిమా వస్తోంది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప‌వ్రీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మ‌డ్డి, మ‌నోహార్ రెడ్డి ఈడా నిర్మాత‌లుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజ్ విరాఠ్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తోన్న ఈ మూవీకి ‘బొమ్మ బ్లాక్‌బ‌స్టర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ మోషన్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘ఈ పేజీ విశాఖ జిల్లా అచ్యుతాపురం Pin Code: 531011 పాత శివాలయం వెనక సందులో ఉండే ‘‘పోతురాజు’’ గాడి పుస్తకంలోనిది’ అని పెట్టిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నలిగిపోయిన పేపర్‌పై టైటిల్ లోగో చాలా కొత్తగా అనిపిస్తోంది. Also Read: మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా ద‌ర్శకుడు రాజ్ విరాఠ్ మాట్లాడుతూ.. ‘‘బొమ్మ బ్లాక్ బ‌స్టర్ అనే టైటిల్‌కి త‌గ్గట్టుగానే సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని ప‌క్కాగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని మా టీమ్ మొత్తం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాలో నందు, ర‌ష్మి క్యారెక్టర్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. నా స్టోరీని నమ్మి నామీద న‌మ్మకంతో నాకు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత‌లు ప్రవీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి ఈడా గార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞత‌లు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకి సంబ‌ధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే ప్రక‌టిస్తాం’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సుజాతా సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బి.సుభాస్కర్ ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Quh163
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...