Thursday, 27 August 2020

అందుకే షూటింగ్ ఆపాం.. వ‌దంతులు న‌మ్మకండి: ‘నాంది’ చిత్ర బృందం

అల్లరి న‌రేష్ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న చిత్రం ‘నాంది’. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. న‌రేష్ అండ‌ర్ ట్రయ‌ల్ ఖైదీగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ జ‌రిపారు. బుధ‌వారం వ‌ర్షం రావ‌డంతో చిత్రీక‌ర‌ణ నిలిపివేశారు. వాస్తవం ఇది కాగా, యూనిట్ మెంబ‌ర్స్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో షూటింగ్ నిలిపి వేశారంటూ ఆన్‌లైన్‌లో కొంత‌మంది ప్రచారంలోకి తెచ్చారు. దీనిని చిత్ర బృందం ఖండించింది. ద‌య‌చేసి అలాంటి వ‌దంతుల‌ను ప్రచారం చేయ‌వ‌ద్దని, వాటిని న‌మ్మవ‌ద్దని కోరింది. వ‌ర్షం వ‌ల్లే చిత్రీక‌ర‌ణను ఆపాం త‌ప్ప, వేరే కార‌ణంతో కాద‌ని స్పష్టం చేసింది. Also Read: ‘నాంది’ అల్లరి న‌రేష్ న‌టిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటివ‌ర‌కూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకుల‌కు న‌వ్వులు పంచుతూ వ‌చ్చిన ఆయ‌న ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్రను చేస్తున్నార‌ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ టీజ‌ర్‌తో తెలిసింది. ఈ టీజ‌ర్‌కు అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది. న‌టుడిగా అల్లరి న‌రేష్‌లోని మ‌రో కోణాన్ని ఈ సినిమాలో మ‌నం చూడ‌బోతున్నాం. వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్‌గా, హ‌రీష్ ఉత్తమ‌న్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా న‌టిస్తున్నారు. న‌వ‌మి, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తూమ్ వెంకట్ కథ అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. చైతన్య ప్రసాద్, శ్రీమణి సాహిత్యం అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D7D5Aw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...