Tuesday, 4 August 2020

దిల్ బేచారా మరోసారి చూసి.. హీరోయిన్ ప్రతి జింతా ఎమోషనల్

బాలీవుడ్ యువ హీరో నటించిన చివరి చిత్రం దిల్ బేచారా. కరోనా మహమ్మారి వలన ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైన సంగతి తెలిసింది. అయితే సుశాంత్ చివరి సినిమా కావడంతో ప్రతీ ఒకరు ఈ చిత్రం చూసి ఎమోషనల్ అయిపోతున్నారు. సుశాంత్ అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు సైతం సినిమా చూశారు. దిల్ బేచారా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. కొందరు ప్రముఖులు ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యామంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిల్ బేచారా సినిమాను మరోసారి చూశానంటూ ట్వీట్ చేసింది. సుశాంత్ చివరి చిత్రంకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు అని ప్రీతి తన ట్విట్టర్ ద్వారా దర్శకుడు ముఖేష్ చాబ్రాకి ధన్యవాదాలు తెలిపింది. అలానే ఇది వాస్తవికతకి అద్దం పట్టేలా ఉంది. కన్నీరు తెప్పించింది అంటూ సినిమా స్టిల్స్ కూడా షేర్ చేసింది ప్రతీ. సినిమాలో అందరూ బాగా నటించారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింద. మిస్ యూ అంటూ సుశాంత్‌ను ఉద్దేశించి ట్యాగ్ కూడా చేసింది ప్రీతి. దిల్ బేచారా చిత్రంలో సంజనా సంఘి, అతిథి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌, స్వస్థికా ముఖర్జీ తదితరులు నటించరు. ఈ సినిమాకు ముఖేశ్‌ చాబ్రా దర్శకత్వం వహించగా... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. దిల్ బేచారా చిత్రాన్ని 24 గంటలలో 95 మిలియన్స్‌కి పైగా వీక్షించి సరికొత్త రికార్డ్ సృష్టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3frHQ59
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...