Tuesday, 4 August 2020

సుశాంత్ కేసు విచారణపై బీహార్ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసును సరిగా విచారిండచం లేదన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సైతం ముంబై పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుశాంత్‌ కేసులో ఏదో తప్పు జరుగుతున్నదని బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ముంబై పోలీసులు తమను అన్ని విధాలా అడ్డుకోవడం, ఎవరినీ సంప్రదించనీయకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని మంగళవారం ఆయన అన్నారు. కేసు దర్యాప్తునకు ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచారని పాండే విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసుల పట్ల గర్వంగా ఉన్నట్లయితే సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఈ 50 రోజుల్లో వారు ఏమి సాధించారో చెప్పాలని గుప్తేశ్వర్ పాండే డిమాండ్‌ చేశారు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం పోలీస్‌ అధికారి వినయ్‌ తివారీని ముంబైలో క్వారంటైన్‌లో ఉంచడాన్ని తప్పుపట్టారు. అయితే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు తమ చర్యను సమర్థించుకున్నారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యహరించినట్లు పేర్కొన్నారు. Read More: మహారాష్ట్ర పరిధికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేసే అధికారం బీహార్‌ పోలీసులకు లేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మరణం కేసు వ్యవహారం మహారాష్ట్ర, బీహార్‌ పోలీసులు, ఆ రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది. మరోవైపు సుశాంత్ మృతికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ డెర్మటాలజిస్ట్ వీడియో సైతం వైరల్ అయ్యింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అని అనేకమంది ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి సైతం బీహార పోలీసులకు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XqhV7M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...