Wednesday, 12 August 2020

మరోసారి తల్లి కాబోతోన్న కరీనా కపూర్

బాలీవుడ్ ప్రముఖ జంట సైఫ్ అలీ ఖాన్, మరోసారి అమ్మానాన్నలు కాబోతున్నారు. తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ పటౌడి దంపతులు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మా కుటుంబంలోకి మరో వ్యక్తి చేరబోతున్నారని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు - సైఫ్ అండ్ కరీనా’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీ ఖాన్ 25వ పుట్టినరోజు (ఆగస్టు 12) నాడే కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీని ప్రకటించడం విశేషం. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా తన సవతి కూతురుకి కరీనా కపూర్ బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు. తండ్రి సైఫ్‌తో కలిసి సారా ఉన్న పాత ఫొటోను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చెప్పారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో బాబు పుట్టాడు. అతడికి తైమూర్ అలీ ఖాన్ పటౌడి అని నామకరణం చేశారు. ప్రస్తుతం తైమూర్ వయసు మూడేళ్లు. కరీనా కపూర్ తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఆ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇప్పుడూ అదే పరిస్థితి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కరీనా.. కరణ్ జోహార్ చిత్రం ‘టఖ్త్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, జాన్వి కపూర్, అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33TpmZa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...