Thursday, 20 August 2020

‘ఆదిపురుష్’ వీఎఫ్‌ఎక్స్‌ కోసం భారీ బడ్జెట్.. ‘బాహుబలి’కి మించి!!

‘ఆదిపురుష్’ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ దీని గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ చిత్రంగా ‘ఆదిపురుష్’ ఉండబోతోందని.. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. అయితే, ఈ సినిమాపై ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆదిపురుష్’లో ‘బాహుబలి’కి మించి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పటి వరకు పొందని అనుభూతిని ఈ సినిమా ద్వారా పొందబోతున్నారట. భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ అబ్బురపరుస్తాయట. అయితే, బడ్జెట్ వెయ్యి కోట్లు కాదని రూ.500 కోట్లు అని అంటున్నారు. ఈ మొత్తంలో సగ భాగం వీఎఫ్ఎక్స్‌కే ఖర్చుచేస్తున్నారని సమాచారం. అంటే, వీఎఫ్ఎక్స్ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చుచేయబోతున్నారట. నిజానికి ఇది ‘బాహుబలి’ కంటే అధికం. ‘బాహుబలి’ రెండు చిత్రాలకు కలుపుకుని వీఎఫ్ఎక్స్‌కు సుమారు రూ.200 కోట్లు ఖర్చుచేసినట్టు సమాచారం. Also Read: కాగా, ‘ఆదిపురుష్’ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా ఇదే. ఇప్పుడు ‘ఆదిపురుష్’తో టాలీవుడ్‌లోకి కూడా ఆయన అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు. ఆ తరవాత తమిళం, మలయాళం, కన్నడ, ఇతర భాషల్లోకి అనువాదం చేస్తారు. 3డి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిలింస్ సమర్పణలో రెట్రోఫిలిస్ ప్రొడక్షన్, టి-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gfkKij
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...