Monday, 3 August 2020

చిరంజీవి ఇంట రాఖీ సంబరాలు.. చెల్లెళ్లకు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

అన్నచెల్లెలు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి పండగ. అందుకే మన దేశంలో ఈ పండగను కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒకరు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఇంట రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇద్దరు చెల్లెల్లు వచ్చి మెగా బ్రదర్‌కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు తినిపించి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు.. తన ఇద్దరు చెల్లెల్లకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. ఇద్దరికి రెండు హారాలు బహుమానంగా అందించారు. ఇద్దరకీ ఒకేలాంటి గిఫ్ట్ ఇస్తున్నాను.. మళ్లీ కొట్టుకోకుండా అంటూ చిరు తన బహుమతిని అందించారు. చిరంజీవి అలా అనగానే ముగ్గురు ఒకేసారి నవ్వుతూ అప్యాయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చెల్లెల్లతోనే కాదు.. తెలుగింటి ఆడుపడుచలందరితోనూ అన్నయ్య అనే పిలిపించుకునే అదృష్టం అతనిది అన్నారు. రాఖీ పండగ సందర్భంగా తెలుగు ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. చిరుకు ప్రతీ ఏడాది ఆయన ఇద్దరు చెల్లెల్లు వచ్చి రాఖీ కట్టి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33m3RQc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...