Thursday, 27 August 2020

మానసికంగా మానభంగం చేస్తున్నారు.. అందరినీ బయటికి లాగుతా: యాంకర్ ప్రదీప్ హెచ్చరిక

తనపై 139 మంది ఐదువేల సార్లు అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మిర్యాలగూడకు చెందిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి చేసిన ఫిర్యాదు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే, యువతి ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ పేరు కూడా ఉంది. దీంతో ప్రదీప్‌‌పై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆయన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. అలాగే, యూట్యూబ్‌లోనూ వీడియోలు పోస్ట్ చేశారు. వీటిపై గురువారం ప్రదీప్ స్పందించారు. ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానెళ్లలో తనపై వస్తోన్న ఆరోపణలు బాధాకరం అని ప్రదీప్ అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, అదే నిజమని నమ్ముతూ తనపై రకరకాల ఆర్టికల్స్ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సున్నితమైన ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా యాంకర్ ప్రదీప్ పేరు కనిపించగానే ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారని మండిపడ్డారు. అవతల వ్యక్తులు ఏ ఉద్దేశంతో చెప్పారో.. ఎవరు చెప్పించారో ఆలోచించకుండా టార్గెట్ చేయడం, ఎటాక్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, దారుణమైన భాష వాడటం ఎంతగానో బాధ కలిగిస్తోందని ప్రదీప్ అన్నారు. Also Read: ‘‘ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఇంకో వ్యక్తి జీవితం నాశనం చేసేస్తారా?’’ అని ప్రదీప్ ప్రశ్నించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ నెట్‌వర్క్‌లో కొంత మంది చేస్తోన్న టార్చర్ వల్ల నిజం తెలిసే లోపల తనకు గానీ, తన ఫ్యామిలీకి గానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానసికంగా మానభంగం చేసినట్టే అని అన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్లందరినీ బయటికి లాగుతానని ప్రదీప్ హెచ్చరించారు. అలాగే, తనపై ఇష్టమొచ్చినట్టు రాతలు రాసేవారిపై, కామెంట్లు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YFvvV9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...