Sunday, 23 August 2020

నా వంతు వచ్చింది.. సారీ ప్రభాస్ అన్న: పెళ్లి కబురు చెప్పిన సాయి ధరమ్ తేజ్!

టాలీవుడ్‌లో బ్యాచ్‌లర్ల సంఖ్య తగ్గుతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లుగా ఉన్న నితిన్, రానా దగ్గుబాటి ఈ లాక్‌డౌన్ సమయంలోనే పెళ్లి పీటలు ఎక్కారు. అలాగే, యంగ్ హీరో నిఖిల్ కూడా పెళ్లి చేసుకున్నారు. సింగిల్ ఆర్మీకి టీమ్ లీడర్ అయిన ప్రభాస్‌ను పక్కనబెట్టి ఈ బ్యాచ్‌లర్లంతా కుటుంబరావుల్లా మారిపోయారు. ఇప్పుడు సుప్రీం హీరో కూడా ప్రభాస్‌కు హ్యాండిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రభాస్‌కు సారీ చెబుతూ ఇప్పుడు తన వంతు వచ్చిందని చెప్పారు సాయి తేజ్. మరి ఇది పెళ్లి గురించేనా? లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషనా? రేపు తెలిసిపోనుంది. Also Read: ‘‘ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం.. కానీ, ఆ టైం వచ్చినప్పుడు మరి..’’ అంటూ ఒక చిన్న వీడియోను సాయి తేజ్ ఆదివారం ట్వీట్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. అయితే, ఇది పెళ్లి కబురే అని మనం ఫిక్స్ అవ్వడానికి వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ‘సింగిల్ ఆర్మీ’ వాట్సాప్ గ్రూప్ కాన్వర్జేషన్‌ను చూపించారు. ఈ గ్రూపులో ఉన్న నిఖిల్, నితిన్, రానా.. ఒక్కొక్కరిగా పెళ్లి కబురు చెబుతూ గ్రూపు నుంచి లెఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు సాయి తేజ్.. ‘ఇట్స్ మై టైమ్. సారీ.. ప్రభాస్ అన్న’ అని మెసేజ్ చేశారు. అంటే, ప్రభాస్‌ను బ్యాచ్‌లర్‌గా వదిలేసి సాయి తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని మనం అనుకోవాలి. దీనిపై రేపు స్పష్టత వచ్చేస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయి తేజ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. కిందటేడాది ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో విజయాలు అందుకున్న సుప్రీం హీరో.. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీని తరవాత దేవా కట్ట దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YmZOzS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...